News October 26, 2024
KNR: కౌలు రైతులకు సాయం అందేనా!

కరీంనగర్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పట్టాదారులకు పంట రుణాలు, రుణమాఫీలు అందిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద కౌలు దారులకు ఏటా ఎకరానికి రూ.15వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 5, 2025
ఎల్లుండి కరీంనగర్‌కు గవర్నర్.. కలెక్టర్ మీటింగ్

నవంబర్ 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేసి సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.
News November 4, 2025
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రేపు కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, ఎల్లుండి రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మే ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే తీసుకురావాలన్నారు.
News November 4, 2025
కరీంనగర్: మహిళల రక్షణే షీ టీమ్స్ లక్ష్యం: సీపీ గౌస్ఆలం

మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కరీంనగర్ సీపీ గౌస్ఆలం తెలిపారు. అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈక్రమంలో 70 ప్రాంతాల్లో నిఘా పెట్టి, 30 మంది పోకిరీలను పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. ఫిర్యాదుల మేరకు 13 మంది వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


