News October 26, 2024

శంషాబాద్ టు వైజాగ్.. 4 గంటలే ప్రయాణం

image

శంషాబాద్ నుంచి వైజాగ్‌కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్‌లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు.

Similar News

News October 26, 2024

హీరోతో పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్

image

జయం రవితో పెళ్లి జరగబోతోందని వచ్చిన వార్తలను హీరోయిన్ ప్రియాంక మోహన్ ఖండించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ‘జయం రవితో బ్రదర్ సినిమాలో నటించా. మేమిద్దరం దండలు వేసుకుని దిగిన ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో మాకు నిశ్చితార్థం జరిగిందని టాలీవుడ్‌లోని కొందరు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అది సినిమాలోని స్టిల్ మాత్రమే. ఆ ఫొటోనే రిలీజ్ చేసినందుకు మేకర్స్‌ను తిట్టుకున్నా’ అని తెలిపారు.

News October 26, 2024

రోహిత్ ఫ్లాప్ షో

image

హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్‌కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?

News October 26, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS ఎమ్మెల్యేలను గమనిస్తున్నాం: మధుయాష్కీ

image

TG: MLC జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. ‘ఈ హత్యపై DGPకి ఫిర్యాదు చేస్తాం. ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు భద్రత ఇవ్వలేదు. పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరిన BRS MLAల వ్యవహార శైలిని గమనిస్తున్నాం. కాంగ్రెస్‌పై ప్రేమతో వాళ్లు పార్టీలోకి రావట్లేదు’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.