News October 26, 2024
HYD: GHMC టెక్నాలజీ ఎక్కడ..? మళ్లీ పాత పద్ధతే!
గ్రేటర్ HYDలో మ్యాన్ హోల్ క్లీనింగ్ కోసం అనేకచోట్ల ఇన్ని రోజులు బకెటింగ్ యంత్రాలను ఉపయోగించారు. తాజాగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలుచోట్ల మళ్లీ పాత పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాన్ హోల్ క్లీనింగ్ కారణంగా భారతదేశంలో 1993-2021 వరకు 971 మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ, ఎందుకు మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారని..? ప్రజలు ప్రశ్నించారు.
Similar News
News November 27, 2024
HYD, రంగారెడ్డి రీజియన్: RTCలో 289 కాంట్రాక్ట్ ఉద్యోగాలు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. HYD రీజియన్‌లో 117, ఉమ్మడి RRలో 172 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT
News November 27, 2024
హైదరాబాద్: సెల్ ఫోన్ డ్రైవింగ్.. యముడి పిలుపు!
రోడ్డు ప్రమాదాల నివారణకు HYD పోలీసులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. CYB, HYD, రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లలో నిత్యం సూచనలు చేస్తున్నారు. తాజాగా రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ఫోకస్ పెట్టారు. ‘సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. బహుశ అది యముడి పిలుపు కావొచ్చు’ అని పంజాగుట్టలో ఉన్న ఓ బోర్డు ఆలోచింపజేస్తోంది. Follow Traffic Rules.
Share it
News November 27, 2024
EVMలు ట్యాంపరింగ్ అవ్వవు: కలెక్టర్
ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.