News October 26, 2024

యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యకలాపాలు.. లాడ్జి సీజ్

image

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన లాడ్జిని రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. పాతగుట్ట కాలనీలో యాదాద్రి ఫ్యామిలీ రూమ్స్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 26న లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాల ఘటనపై కేసు నమోదైందని.. విచారణ అనంతరం RDO ఆదేశాలతో సీజ్ చేసినట్లు CI రమేశ్ వెల్లడించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News September 16, 2025

బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

image

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

News September 16, 2025

నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

image

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 16, 2025

రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

image

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.