News October 26, 2024

TNGOలతో కలిసి పని పనిచేస్తాం RTC JAC

image

TGSRTC ఇకనుంచి టీఎన్జీవోతో కలిసి పని చేయనున్నట్లు RTC JAC ప్రకటించింది. టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన 2 జేఏసీల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో సంయుక్తంగా పోరాట కార్యక్రమం రూపొందించుకుంటామని తెలిపారు. JAC వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

HYD: నీటితో ఆటలాడితే.. నల్లా కనెక్షన్ కట్

image

మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలకు సిద్ధమైంది. వాహనాల వాషింగ్‌, గార్డెనింగ్‌, రోడ్లపై నీటిని వృథా చేస్తే రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. 2సార్లు అవకాశం ఇచ్చి, ఆపై నల్లా కనెక్షన్‌ కట్‌ చేస్తారు. నీటి వృథాపై ఫొటో, లొకేషన్‌తో ‘పానీ యాప్‌’లో సమాచారం పంపేందుకు 10 వేల మంది వాటర్‌ వాలంటీర్లను రంగంలోకి దింపనున్నారు. 15 రోజుల్లో యాప్ అందుబాటులోకి రానుంది.

News January 12, 2026

FLASH: బోరబండలో యువతి మర్డర్

image

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.

News January 11, 2026

HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చెయ్యి కట్!

image

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.