News October 26, 2024

AI అవకాశాలతో APని అభివృద్ధి చేస్తాం: లోకేశ్

image

ట్రెండింగ్‌లో ఉన్న AI అవకాశాలను వినియోగించుకుని APని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. USA శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘AI ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందిస్తాం. మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నాం’ అని వెల్లడించారు.

Similar News

News October 26, 2024

డెమోక్రాట్ల‌ను టెన్ష‌న్ పెడుతున్న మిచిగాన్‌

image

7 స్వింగ్ స్టేట్స్‌లో ఒక‌టైన మిచిగాన్ డెమోక్రాట్ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ఇక్క‌డ దాదాపు 4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న అర‌బ్ అమెరిక‌న్స్ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ ప‌రిస్థితుల‌ను బైడెన్ నియంత్రించ‌లేక‌పోయారని అసంతృప్తితో ఉన్నారు. 2020 ఎన్నిక‌ల్లో బైడెన్‌కు ప‌ట్టం క‌ట్టిన మిచిగాన్ ఈ సారి బైడెన్‌, అయ‌న విధానాల‌ను వ్య‌తిరేకించ‌ని క‌మ‌ల‌పై గుర్రుగా ఉన్నారు. దీంతో మిచిగాన్ డెమోక్రాట్లను టెన్షన్ పెడుతోంది.

News October 26, 2024

‘సరస్వతి’ భూముల్లో సర్వే

image

AP: మాజీ CM జగన్‌ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కాగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి ఎకరా రూ.3 లక్షల చొప్పున 1,515.93 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీటిలో అటవీ భూములు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

News October 26, 2024

‘కూలీ’ తర్వాత తలైవాతో నెల్సన్ సెకండ్ మూవీ

image

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మరోసారి సినిమా చేసేందుకు నెల్సన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం తలైవా లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తికాగానే నెల్సన్ ప్రాజెక్ట్ మొదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, అది కచ్చితంగా ‘జైలర్-2’ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని అందుకోగా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.