News October 26, 2024

350+ రన్స్ ఛేదించడంలో ఇండియా తడబాటు!

image

రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై గెలిచేందుకు టీమ్ఇండియా 358 రన్స్ చేయాల్సి ఉంది. అయితే, టీమ్ఇండియా 350+ స్కోరును కేవలం రెండు సార్లే ఛేదించింది. 350కి పైగా పరుగుల లక్ష్యంతో 63 ఇన్నింగ్స్ ఆడితే కేవలం రెండిట్లోనే గెలుపొంది 40 సార్లు ఓడిపోయింది. మరో 21 సార్లు డ్రా చేసుకుంది. 1976లో WIతో మ్యాచ్‌లో 403, 2008లో ENGతో మ్యాచ్‌లో 387 రన్స్‌ ఛేదించి ఇండియా గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో IND గెలుస్తుందా?

Similar News

News October 26, 2024

ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్

image

భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్‌లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.

News October 26, 2024

ఎల్లుండి భూమి సమీపానికి భారీ గ్రహశకలం

image

ఈ నెల 28న ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహ శకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది సెకనుకు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News October 26, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. బిగ్ అప్డేట్

image

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యాప్‌ను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.