News October 26, 2024
తూ.గో: బాధితుడికి మంత్రి లోకేశ్ హామీ

తూ.గో.జిల్లా అనపర్తి మండలం మార్కండేయపురానికి చెందిన ప్రమీల అనే మహిళ పనికోసం కువైట్ వెళ్లింది. ఏజెంట్ మాటలు నమ్మి ఆమె వెళ్లగా వంటపని కాకుండా ఇతర పనులు చేయిస్తూ జీతం ఇవ్వట్లేదని ఆమె భర్త రాజాప్రసాద్ వాపోయారు. తన భార్యను స్వదేశానికి తీసుకురావాలని ఆయన మంత్రి లోకేశ్‌ను Xలో వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఎక్స్ ద్వారా లోకేశ్ హామీ ఇచ్చారు.
Similar News
News January 11, 2026
రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.
News January 11, 2026
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, పేకాట తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నర్సింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలకు ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని, కోడి కత్తుల తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించరాదంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.