News October 26, 2024
ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉన్నారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదల, పంటల ఎగుమతులు, దిగుమతులపై అధ్యయనం చేయాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ధరల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేయాలని సూచించింది.
Similar News
News March 19, 2025
నెల రోజులపాటు గ్రామ గ్రామాన సంబరాలు: టీపీసీసీ చీఫ్

TG: BC కులగణన, SC వర్గీకరణపై రాష్ట్రమంతటా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘అసెంబ్లీలో BC కులగణన, SC వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో నెల రోజులపాటు సంబరాలు నిర్వహించాలి. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి’ అని తెలిపారు.
News March 19, 2025
నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.
News March 19, 2025
తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.