News October 26, 2024

‘సరస్వతి’ భూముల్లో సర్వే

image

AP: మాజీ CM జగన్‌ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కాగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి ఎకరా రూ.3 లక్షల చొప్పున 1,515.93 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీటిలో అటవీ భూములు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News October 26, 2024

సినిమా ఛాన్స్‌లు రాకపోయినా ప్రశ్నిస్తూనే ఉంటా: ప్రకాశ్ రాజ్

image

సమాజంలో జరిగే తప్పులను చూస్తూ ఊరుకోలేనని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం ఆపనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నా కుమారుడి (సిద్ధు) మరణంతో బాధలో కూరుకుపోయా. కానీ నాకు కుటుంబం ఉంది. వృత్తి ఉంది. నాకంటూ మనుషులున్నారు. జీవితం ఉంది. అందుకే తిరిగి నిలబడ్డా. నా టాలెంట్‌ చూసి ప్రజలు ఆదరించారు. వారి ప్రేమ వల్లే ఇంకా నటుడిగా కొనసాగుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News October 26, 2024

RTCలో 7,545 ఉద్యోగాలు!

image

APSRTCలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.

News October 26, 2024

ALTT ఓటీటీపై ఫిర్యాదులు

image

ALTT ఓటీటీపై చ‌ర్య‌లు తీసుకోవాలని ముంబై పోలీసులకు స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్ ఉద‌య్ మ‌హుర్క‌ర్ ఆధ్వ‌ర్యంలోని సేవ్ క‌ల్చ‌ర్‌-సేవ్ భార‌త్ ఫౌండేష‌న్‌ ఫిర్యాదు చేసింది. సదరు OTT అస‌భ్య‌క‌ర కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చ‌ట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక‌-అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఉద‌య్ పేర్కొన్నారు.