News October 26, 2024

ఇరాన్‌పై దాడి: జాగ్రత్తపడిన ఇజ్రాయెల్!

image

ఇరాన్‌పై జరిపిన ప్ర‌తీకార దాడి అంత‌ర్జాతీయ సంఘ‌ర్ష‌ణల‌కు దారి తీయ‌కుండా ఇజ్రాయెల్ జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన 20 వైమానిక స్థావ‌రాల‌నే టార్గెట్ చేసింది. అక్కడి న్యూక్లియ‌ర్ ప్లాంట్లు, Oil రిఫైన‌రీలను టచ్ చేయలేదు. సార్వ‌భౌమాధికారం గ‌ల దేశంపై దాడి చేస్తే ప్ర‌తిదాడి త‌మ హ‌క్కు అని నిరూపించడానికే Precise Strikes జరిపింది. దాడికి 100 F-35Adir, F-15I Ra’am, F-16I Sufa జెట్‌లను వాడింది.

Similar News

News January 3, 2025

SHOCKING: జట్టు నుంచి రోహిత్ ఔట్!

image

సిడ్నీ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రచారంలో ఉన్నట్లుగా రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకొన్నారు. ఆయనకు బదులు కెప్టెన్‌గా బుమ్రా టాస్‌కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా రెస్ట్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక తుది జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు మార్ష్ స్థానంలో వెబ్‌స్టెర్ డెబ్యూ కానున్నారు.

News January 3, 2025

‘టెట్’ తొలిరోజు ప్రశాంతం

image

TG: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు తొలిరోజైన గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25శాతం మంది, మధ్యాహ్నం 75.68శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షని నిర్వహించనున్నారు.

News January 3, 2025

2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!

image

TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.