News October 26, 2024

కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఉన్నారా?: షర్మిల

image

AP: ఆస్తి విషయంలో వైసీపీ చీఫ్ జగన్ తమపై కేసు పెట్టడం చూసి చాలా బాధేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ‘ప్రతి ఇంట్లో ఇలాంటివి సహజమని అంత సులభంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ లేవా?’ అని జగన్‌ను నిలదీశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని షర్మిల దుయ్యబట్టారు.

Similar News

News October 26, 2024

కొంక‌ణ్‌ తీరాన్ని ఏలేది ఎవరు?

image

మ‌హారాష్ట్ర‌లోని కొంక‌ణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో ద‌శ‌లో ఒక్కో పార్టీ త‌న ప్రాభ‌వాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూట‌ములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలిక‌ల‌తో బీజేపీ, శివ‌సేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్‌తో కలసి గ‌త వైభ‌వాన్ని చాటేందుకు ఉద్ధ‌వ్ ఠాక్రే, శ‌ర‌ద్ ప‌వార్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

News October 26, 2024

మినీ మేడారం జాతర తేదీలు ఖరారు

image

TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.

News October 26, 2024

మూగజీవాల కోసం ఎన్జీవో: రేణూదేశాయ్

image

మూగ జీవాల రక్షణ కోసం సొంత ఎన్జీవోను రిజిస్టర్ చేయించినట్లు రేణూదేశాయ్ తెలిపారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు ముందుకు రావాలని వీడియోలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిన్నతనం నుంచి మూగజీవాల సంరక్షణ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఈ క్రమంలో వాటి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.