News October 26, 2024
రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన MLAలు, MP

ఒంగోలులోని మంగమ్మ కాలేజీ జంక్షన్‌లో రూ.1.30 కోట్లతో నూతనంగా మంజూరైన రోడ్డు నిర్మాణానికి పలువురు టీడీపీ నేతలు భూమి పూజ చేశారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వరకు గల తారు రోడ్డుకు భూమి పూజా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భూమి పూజ చేశారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం: CMపై అసభ్యకర పోస్టులు.. టీచర్‌పై కేసు

సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీచర్ పై శుక్రవారం కేసు నమోదైనట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. కనిగిరికి చెందిన టీచర్ శ్రీనివాసులు చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియోలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 27, 2025
ఒంగోలులో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్

ఒంగోలులోని సెయింట్ జెవియర్ స్కూల్ లో శనివారం జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ పీడీ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరియర్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే వృత్తి విద్యపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.