News October 26, 2024

ప్రాణ త్యాగం చేసైనా వక్ఫ్ బిల్లును అడ్డుకుంటాం: మౌలానా ఖ‌లీద్

image

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును అడ్డుకోవడానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖ‌లీద్ సైఫుల్లా అన్నారు. ‘ఇది మాకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ బిల్లు అమలును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే ముస్లింలు జైల్ భరో కార్యక్రమాలు చేపడతారు’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే అత్య‌ధికంగా వ‌క్ఫ్ ఆస్తుల‌ను ఆక్ర‌మించిందని మౌలానా ఆరోపించారు.

Similar News

News October 26, 2024

చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్

image

తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్‌ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.

News October 26, 2024

కొంక‌ణ్‌ తీరాన్ని ఏలేది ఎవరు?

image

మ‌హారాష్ట్ర‌లోని కొంక‌ణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో ద‌శ‌లో ఒక్కో పార్టీ త‌న ప్రాభ‌వాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూట‌ములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలిక‌ల‌తో బీజేపీ, శివ‌సేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్‌తో కలసి గ‌త వైభ‌వాన్ని చాటేందుకు ఉద్ధ‌వ్ ఠాక్రే, శ‌ర‌ద్ ప‌వార్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

News October 26, 2024

మినీ మేడారం జాతర తేదీలు ఖరారు

image

TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.