News October 26, 2024

12 ఏళ్లలో తొలిసారి స్వదేశంలో సిరీస్ ఓటమి

image

4331 రోజులుగా అనేక మేటి జట్లు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్ సాధించింది. 2012 తర్వాత స్వదేశంలో సిరీస్ ఓటమి తెలియని భారత్‌ను సునాయాసంగా ఓడించింది. మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. న్యూజిలాండ్‌కు భారత్‌లో ఇదే తొలి సిరీస్ విజయం. భారత్‌కు 18 సిరీస్‌ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి.

Similar News

News October 26, 2024

చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్

image

తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్‌ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.

News October 26, 2024

కొంక‌ణ్‌ తీరాన్ని ఏలేది ఎవరు?

image

మ‌హారాష్ట్ర‌లోని కొంక‌ణ్ తీర ప్రాంతంలో 75 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో ద‌శ‌లో ఒక్కో పార్టీ త‌న ప్రాభ‌వాన్ని చాటిన ఈ ప్రాంతంలో ఇప్పుడు 2 కూట‌ములు, 6 పార్టీలు ఉనికి కోసం పోటీ పడుతున్నాయి. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు పార్టీల చీలిక‌ల‌తో బీజేపీ, శివ‌సేన, NCPల గుప్పెట్లో ఉంది. అయితే, కాంగ్రెస్‌తో కలసి గ‌త వైభ‌వాన్ని చాటేందుకు ఉద్ధ‌వ్ ఠాక్రే, శ‌ర‌ద్ ప‌వార్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

News October 26, 2024

మినీ మేడారం జాతర తేదీలు ఖరారు

image

TG: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మినీ మేడారం జాతరకు సైతం భక్తులు భారీగా తరలివస్తారు. గద్దెల వద్ద పొర్లుదండాలు పెడతారు. సారె చీరలు, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే పెద్ద జాతరలా అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.