News October 26, 2024
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో పరాజయం. కీలక ప్లేయర్, కెప్టెన్ విలియమ్సన్ గాయంతో దూరమయ్యారు. దీంతో NZపై భారత్ సులభంగా సిరీస్ గెలిచేస్తుందని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ కివీస్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. తొలి టెస్టులో పేస్‌తో దెబ్బకొట్టి, రెండో టెస్టులో స్పిన్‌తో భారత ప్లేయర్లను అల్లాడించారు. 1955 తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించారు.
Similar News
News November 3, 2024
భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా.. ఖండించిన కేంద్రం
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. కెనడాలో సైబర్ నేరాలకు భారత్ ప్రయత్నిస్తోందని, భారత ప్రభుత్వ ప్రాయోజిత సైబర్ నేరగాళ్లు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడికి పాల్పడవచ్చని భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇది భారత్‌పై దాడికి కెనడా అనుసరిస్తున్న మరో వ్యూహంగా అభివర్ణించింది.
News November 3, 2024
పంత్ ఢిల్లీని అందుకే వదిలేశాడా?
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఢిల్లీని వీడేందుకు బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా పాంటింగ్, డైరెక్టర్‌గా గంగూలీని తప్పించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాల్ రావును డైరెక్టర్‌గా నియమించడమూ ఇష్టం లేదట. అలాగే GMR ఆధ్వర్యంలో ఆయన ఆడేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది. JSW ఆధ్వర్యంలోనే ఆయన ఆడాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.
News November 3, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 3, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.