News October 26, 2024

సన్న వడ్లకు రూ.500 బోనస్.. క్యాబినెట్ ఆమోదం

image

TG: సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటీకి భూకేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయించింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Similar News

News October 26, 2024

ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు.. షాక్ కొట్టి మృతి

image

TG: కామారెడ్డి(D) సదాశివనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. యాచారం తండాకు చెందిన మాలోత్ అనిల్ పడుకునే ముందు మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టాలనుకున్నాడు. సాకెట్ దూరంగా ఉండటంతో ఎక్స్‌టెన్సన్ బాక్స్ పక్కనే పెట్టుకుని ఛార్జింగ్ పెట్టాడు. నిద్రలో బాక్స్‌పై కాలు వేయడంతో షాక్ కొట్టి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్‌కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉన్నారు.
* ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

News October 26, 2024

క‌ర్ణాట‌క‌లో మ‌రో రాజ‌కీయ దుమారం

image

KAలోని విజ‌య‌పుర జిల్లా హొన్వాడాలో 1,500 ఎకరాల భూమిని తిరిగి వక్ఫ్ బోర్డుకు కేటాయించిన వ్యవహారం దుమారం రేపింది. త‌మ పూర్వీకుల‌కు చెందిన‌ భూమిని వ‌క్ఫ్ బోర్డుకు తిరిగి కేటాయించిన‌ట్టుగా త‌హ‌శీల్దార్ లేఖ రాశార‌ని గ్రామ రైతులు తెలిపారు. దీంతో వ‌క్ఫ్ ప్రాప‌ర్టీగా నిర్ధారించేందుకు ఆధారాలు లేవ‌ని BJP.. స్థలాలు వ‌క్ఫ్ బోర్డుకు చెందినవి కాబ‌ట్టే నోటీసులు ఇచ్చార‌ని కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి.

News October 26, 2024

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా షర్మిల: వరుదు కళ్యాణి

image

AP: పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని, ఆయన చేతిలో కీలు బొమ్మలా మారారని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తోంది. రక్తం పంచుకుని పుట్టిన తన అన్న జగన్‌పై ఇలా మాట్లాడటం దుర్మార్గం. సొంత అన్న అనే అనుబంధం కూడా లేకుండా ఆమె ప్రవర్తిస్తున్నారు. ఆమె తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మరు’ అని కళ్యాణి ఫైర్ అయ్యారు.