News October 26, 2024
సరికొత్త రికార్డు సృష్టించనున్న ‘పుష్ప-2’
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టించనుంది. ఇందులో 6,500 స్క్రీన్లు ఇండియాలో కాగా, మిగతావి ఓవర్సీస్. అటు రిలీజ్‌కు ముందే ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ బిజినెస్ చేసింది.
Similar News
News November 2, 2024
మురికి టాయిలెట్స్.. రైల్వేకు రూ.30వేలు ఫైన్
తిరుపతి నుంచి వైజాగ్ సమీపంలోని దువ్వాడకు వెళ్లేందుకు 55 ఏళ్ల మూర్తి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో 3AC టికెట్ కొన్నారు. ప్రయాణ సమయంలో మురికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూర్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా విచారణ జరిపి రైల్వేకు రూ.30వేలు జరిమానా విధించింది.
News November 2, 2024
PIC OF THE DAY
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.
News November 2, 2024
ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడగలరు?
ఒంటి కాలు మీద నిలబడే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి నాడీ-కండరాల పనితీరును తెలుసుకోవచ్చని ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తి కళ్లు తెరిచి ఉంచి 45 సెకండ్ల కంటే ఎక్కువ సేపు నిలబడగలగాలని సూచించారు. అయితే, ఈ సామర్థ్యం వయసు రీత్యా తగ్గుతూ వస్తుందని వెల్లడించారు. 50ఏళ్ల వ్యక్తి 40Secs, 70 ఏళ్ల వ్యక్తి 20 సెకండ్లు ఒంటికాలిపై నిల్చోగలరని చెప్పారు. కళ్లు మూస్తే ఎక్కువసేపు నిల్చోలేరన్నారు.