News October 26, 2024
ఆ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకోండి.. Meta, Xకు కేంద్రం ఆదేశాలు
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపుల కట్టడికి Meta, X సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఈ వేదికల ద్వారా బెదిరింపు కాల్స్, సందేశాలకు ఆస్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని IT శాఖ ఆదేశించింది. దేశ ప్రజల సంక్షేమం, ఆర్థిక అంశాలతో ముడిపడిన కారణంగా బెదిరింపు సందేశాల షేరింగ్, రీట్వీట్‌లకు అడ్డుకట్టవేయాలని, ఇలాంటి సందేశాలకు ప్రాధాన్యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News November 2, 2024
కార్తీక దీపోత్సవాలు.. ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితం
TG: కార్తీకమాసం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి DEC 1 వరకు అన్ని ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సా.6-8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు చేయాలని, పాల్గొనే వారికి 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ ఇవ్వడంతో పాటు ప్రధాన ఆలయాల్లో బ్లౌజ్ పీస్‌లు అందించాలన్నారు.
News November 2, 2024
మురికి టాయిలెట్స్.. రైల్వేకు రూ.30వేలు ఫైన్
తిరుపతి నుంచి వైజాగ్ సమీపంలోని దువ్వాడకు వెళ్లేందుకు 55 ఏళ్ల మూర్తి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో 3AC టికెట్ కొన్నారు. ప్రయాణ సమయంలో మురికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూర్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా విచారణ జరిపి రైల్వేకు రూ.30వేలు జరిమానా విధించింది.
News November 2, 2024
PIC OF THE DAY
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.