News October 26, 2024
స్కిల్ వర్సిటీకి MEIL రూ.200 కోట్లు

TG: యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(MEIL) ముందుకొచ్చింది. మొత్తం క్యాంపస్ నిర్మాణానికి CSR కింద రూ.200 కోట్లు కేటాయించింది. ప్రపంచ స్థాయి నమూనాలతో నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధుల బృందం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే వర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2026
ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
News January 18, 2026
నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.


