News October 26, 2024
VZM: జిల్లా అంతటా ఇసుకకు ఒకే తవ్వకపు ధర

ఇసుక తవ్వకపు ధర జిల్లా అంతటా ఒకే విధంగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంది. విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఇసుక సరఫరా జిల్లా స్థాయి సమావేశం శనివారం జరిగింది. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక తవ్వకపు ధర టన్నుకు రూ.425గా, నేరుగా రీచ్ వద్ద తీసుకునే వారికి రూ.150గా ధరను నిర్ణయించారు. దీనికి ఎటువంటి సీనరేజి లేదని, రవాణా ఛార్జీలను మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 20, 2026
‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
News January 20, 2026
VZM: 26 నుంచి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన స్పెషల్ డ్రైవ్

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 26 నుంచి మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వాములుగా పనిచేయాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాల కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.
News January 19, 2026
ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’: కలెక్టర్

జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి 1-45 రోజులు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. చేతి పంపులు, నీటి పథకాలను తనిఖీ చేసి చెడిపోయిన వాటిని 48 గంటల్లో మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత గ్రామాల్లో బోర్ల లోతు పెంచడం, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు.


