News October 26, 2024
చైనాతో ఒప్పందం ఎలా సాధ్యమైందంటే..: ఎస్ జైశంకర్

తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఉపసంహరణ విషయంలో చైనా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు అంశాలు ఆ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ‘మన సైన్యం అత్యంత కష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడింది. ఒప్పందం వెనుక భారత సైన్యమే తొలి కారణం. ఇక సరిహద్దు వెంబడి దశాబ్దకాలంగా మనం అభివృద్ధి చేసుకున్న మౌలిక వసతులు రెండో కారణం’ అని వివరించారు.
Similar News
News December 29, 2025
ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NDA, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఈ పరీక్ష ద్వారా UPSC త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ (MPC) ఉత్తీర్ణులు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: upsc.gov.in/ *మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 29, 2025
IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

<
News December 29, 2025
వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.


