News October 26, 2024

వ్యర్థాలను తొలగించని బిల్డర్లపై చర్యలు: హైడ్రా

image

TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 27, 2024

39 మంది కానిస్టేబుళ్లపై వేటు

image

TG: కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

News October 27, 2024

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

✒ 1728: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జననం
✒ 1920: భారత మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జననం
✒ 1961: శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా
✒ 1977: శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర జననం
✒ 1984: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
✒ 1987: ప్రముఖ గేయ రచయిత కొసరాజు మరణం

News October 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.