News October 26, 2024

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా షర్మిల: వరుదు కళ్యాణి

image

AP: పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని, ఆయన చేతిలో కీలు బొమ్మలా మారారని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తోంది. రక్తం పంచుకుని పుట్టిన తన అన్న జగన్‌పై ఇలా మాట్లాడటం దుర్మార్గం. సొంత అన్న అనే అనుబంధం కూడా లేకుండా ఆమె ప్రవర్తిస్తున్నారు. ఆమె తప్పుడు ఆరోపణలను ఎవరూ నమ్మరు’ అని కళ్యాణి ఫైర్ అయ్యారు.

Similar News

News October 27, 2024

సుమతీ శతకం.. తాత్పర్యం

image

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని బుద్ధిని విడిచిపెట్టదు. అలాగే హీనుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా అతని బుద్ధి మారదు.

News October 27, 2024

ఈ దేశాల్లో శాంతిభద్రతలు భేష్!

image

ఎటు చూసినా యుద్ధాలు, అశాంతి నెలకొన్న నేటి కాలంలో శాంతిభద్రతల్ని కలిగి ఉన్న దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నట్లు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ తెలిపింది. దాని ప్రకారం.. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్, 4, 5 స్థానాల్లో స్వీడన్, జర్మనీ ఉన్నాయి. భారత్ 79వ ర్యాంకు దక్కించుకోగా చైనా 95, పాక్ 129వ స్థానాల్లో నిలిచాయి.

News October 27, 2024

సీఎస్కేలో ధోనీకి సరైన వారసుడు పంతే: సైమన్

image

చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. ‘పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్‌ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి’ అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.