News October 26, 2024

ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు.. షాక్ కొట్టి మృతి

image

TG: కామారెడ్డి(D) సదాశివనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. యాచారం తండాకు చెందిన మాలోత్ అనిల్ పడుకునే ముందు మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టాలనుకున్నాడు. సాకెట్ దూరంగా ఉండటంతో ఎక్స్‌టెన్సన్ బాక్స్ పక్కనే పెట్టుకుని ఛార్జింగ్ పెట్టాడు. నిద్రలో బాక్స్‌పై కాలు వేయడంతో షాక్ కొట్టి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనిల్‌కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉన్నారు.
* ఛార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

Similar News

News October 27, 2024

ఈ జంతువులది అత్యంత బలమైన నోటి పట్టు!

image

ఒక్కో జంతువు నోటి పట్టుకు ఒక్కో శక్తి ఉంటుంది. దీన్నే బైట్ ఫోర్స్ అంటారు. ఈ శక్తిని కొలిచేందుకు PSI అనే కొలమానాన్ని వాడతారు. నైలు నదిలో ఉండే మొసళ్లకు అత్యధికంగా 5000 పీఎస్ఐ పవర్ ఉంటుంది. వాటి తర్వాత ఉప్పునీటి మొసళ్లు(3700 PSI), అమెరికా మొసళ్లు(2125), హిప్పోపొటమస్(1800), జాగ్వార్(1500), బుల్ షార్క్(1350), గొరిల్లా(1300), ధ్రువపు ఎలుగుబంటి(1200 PSI) ఉన్నాయి. మనిషి బైట్ ఫోర్స్ 162 పీఎస్ఐ మాత్రమే!

News October 27, 2024

సుమతీ శతకం.. తాత్పర్యం

image

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని బుద్ధిని విడిచిపెట్టదు. అలాగే హీనుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా అతని బుద్ధి మారదు.

News October 27, 2024

ఈ దేశాల్లో శాంతిభద్రతలు భేష్!

image

ఎటు చూసినా యుద్ధాలు, అశాంతి నెలకొన్న నేటి కాలంలో శాంతిభద్రతల్ని కలిగి ఉన్న దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నట్లు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ తెలిపింది. దాని ప్రకారం.. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్, 4, 5 స్థానాల్లో స్వీడన్, జర్మనీ ఉన్నాయి. భారత్ 79వ ర్యాంకు దక్కించుకోగా చైనా 95, పాక్ 129వ స్థానాల్లో నిలిచాయి.