News October 26, 2024

లారెన్స్ బిష్ణోయ్ త‌ర‌ఫున నామినేష‌న్ వేస్తాం: UBVS పార్టీ

image

గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్నిక‌ల్లో పోటీ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అత‌ని త‌ర‌ఫున మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసేందుకు AB ఫారం ఇవ్వాలంటూ UBVS పార్టీ నేత సునీల్ శుక్లా ROకి లేఖ రాశారు. బాంద్రా వెస్ట్ నుంచి బిష్ణోయ్‌ను పోటీకి దింపుతామ‌ని, నామినేష‌న్ ఫారం ఇస్తే అత‌ని సంత‌కం తీసుకొస్తాన‌ని శుక్లా పేర్కొన్నారు. హత్యకు గురైన సిద్ధిఖీ గతంలో ఇక్కడ MLAగా గెలుపొందారు.

Similar News

News November 11, 2025

చక్కటి కురులకు చక్కెర స్నానం

image

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.