News October 27, 2024
నేటి ముఖ్యాంశాలు
* AP: ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: చంద్రబాబు
* జగన్ నీకు మానవత్వం, ఎమోషన్స్ లేవా?: షర్మిల
* జగన్ పతనాన్ని కోరుకుంటున్న షర్మిల: అమర్నాథ్
* TG: క్యాబినెట్ భేటీ.. సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు ఆమోదం
* స్కిల్ వర్సిటీ నిర్మాణానికి MEIL రూ.200 కోట్లు
* బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన.. ప్రతిపక్ష నేతల ఫైర్
* న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
Similar News
News November 2, 2024
మళ్లీ CSKలోకి అశ్విన్?
ఐపీఎల్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ను కొనుగోలు చేయాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 38 ఏళ్ల ఆల్‌రౌండర్ 2008 నుంచి 2015 వరకు చెన్నై తరఫున ఆడారు. ఆ తర్వాత వేరే ఫ్రాంచైజీలకు వెళ్లారు. రాజస్థాన్ రిటైన్ చేసుకోకపోవడంతో అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని CSK యోచిస్తోందని TOI తెలిపింది. మరోవైపు ఓపెనర్ డెవాన్ కాన్వేను RTM ద్వారా సొంతం చేసుకోవాలని చెన్నై ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది.
News November 2, 2024
69% కుటుంబాలపై కాలుష్య ప్రభావం
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. నగరంలోని 69% కుటుంబాల్లోని ఎవరో ఒకరు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పొల్యూషన్ సర్వేలో తేలింది. కాలుష్య స్థాయులు పెరగడం వల్ల కళ్లలో మంట, శ్వాసలో ఇబ్బందులు వస్తున్నట్లు వెల్లడైంది. దీపావళి రోజు రాత్రి ఢిల్లీతో పాటు NCRలోని పలు ప్రాంతాల్లో AQI 999కి చేరుకుంది. అటు యమునా నదిలో సైతం కాలుష్యం వల్ల భారీ స్థాయిలో నురగలు ఏర్పడ్డాయి.
News November 2, 2024
నేషనల్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తుకు గడువు పొడిగింపు
జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్‌షిప్స్‌కు గడువును ఈ నెల 15 వరకు కేంద్రం పొడిగించింది. scholarships.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా ఫస్ట్ ఇయర్ బాలికలు దీనికి అర్హులు. సాంకేతిక విద్యను అభ్యసించడానికి ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.50 వేల చొప్పున అందిస్తారు. విద్యార్థినులు తప్పనిసరిగా AICTE ఆమోదించిన కాలేజీలో చదువుతూ ఉండాలి.