News October 27, 2024
జగన్ వల్లే ప్రజలపై ‘విద్యుత్’ భారం: మంత్రి గొట్టిపాటి

AP: వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పారదర్శకత కనిపించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం జగన్‌దేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మీద దాదాపు రూ.11వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. గతంలో ఏపీ జెన్‌కోను నిర్వీర్యం చేసి యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు.
Similar News
News February 5, 2026
$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.
News February 5, 2026
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 5, 2026
ఉదయం లేవగానే ఇది కనిపించిందా?

శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే బల్లిని చూడటం అదృష్టం. ఇది మీ దురదృష్టం తొలగి, విజయం వరించడాన్ని సూచిస్తుంది. బల్లి గోడపైకి పాకుతూ కనిపిస్తే పదోన్నతికి, ఆర్థిక లాభానికి సంకేతం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బల్లి తలపై పడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని, భుజంపై పడితే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ శుభ శకునాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, సిరిసంపదలను తీసుకువస్తాయి.


