News October 27, 2024

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

✒ 1728: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జననం
✒ 1920: భారత మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జననం
✒ 1961: శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా
✒ 1977: శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర జననం
✒ 1984: భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
✒ 1987: ప్రముఖ గేయ రచయిత కొసరాజు మరణం

Similar News

News October 27, 2024

నేడు ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫైనల్ కీ నేడు విడుదల కానుంది. https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు రిలీజ్ చేస్తారు. ఈసారి టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు.

News October 27, 2024

సంయమనం పాటించండి.. ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచన

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘పశ్చిమాసియాలో పరిణామాలను మేం పరిశీలిస్తున్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్య మార్గాలపై దృష్టిసారించాలి. ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అమాయక పౌరులు, బందీలు బాధపడుతూనే ఉంటారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

News October 27, 2024

విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు

image

AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉ.9.35కు విశాఖలో బయలుదేరి ఉ.10.35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు విజయవాడ నుంచి బయలుదేరి రా.9 గంటలకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు రా.7.15కు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, తిరిగి రా.8.45కు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటుంది.