News October 27, 2024

‘ఆపరేషన్ ఒపేరా’ స్టైల్‌లో ఇజ్రాయెల్ ప్రతీకార దాడి

image

ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక <<14459066>>దాడి<<>> ‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తుచేస్తోంది. సాంకేతికత పెద్దగా అభివృద్ధి చెందని 1981లోనే దాదాపు 2000KM దూరంలో ఉన్న ఇరాక్‌లోని ఒసిరక్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ ఏడాది జూన్ 7న సా.4-5.30 మధ్య ఆపరేషన్ ముగిసింది. శత్రుదేశ రాడార్లకు దొరక్కుండా 14 ఫైటర్ జెట్స్(F16A) విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశాయి.

Similar News

News October 27, 2024

సైబర్ నేరాల నియంత్రణకు AI పరిష్కారాలు!

image

సైబ‌ర్ నేరాల‌ను ఎదుర్కొనేందుకు AI ప‌రిష్కారాల కోసం కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్‌లో భాగంగా నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం పోర్ట‌ల్‌ (NCRP)లో పౌరులు సుల‌భంగా సైబ‌ర్ నేరాల‌పై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభ‌జ‌న‌కు అవ‌స‌ర‌మైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.

News October 27, 2024

రోజుకు 10000 STEPS వేస్తున్నారా?

image

ఫిట్నెస్ ట్రాకర్లు వచ్చాక రోజుకు ‘10000 STEPS’ టార్గెట్‌గా పెట్టుకోవడం అలవాటైంది. ఈ ట్రెండుపై కాస్త ఆలోచించాలని పరిశోధకులు అంటున్నారు. ఆయు ప్రమాణం పెరగాలంటే ‘10000’ అవసరమేమీ లేదంటున్నారు. శ్రద్ధగా రోజుకు 2300 అడుగులు వేసినా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. 3300 అడుగులేస్తే డెత్ రిస్క్ 15% తగ్గుతుందని, అదనంగా వేసే ప్రతి 500 స్టెప్స్‌కు 7% కార్డియో డెత్ రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు.

News October 27, 2024

మరో ఆరుగురికి సోకిన డయేరియా

image

AP: రాష్ట్రంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకినట్లు తేలింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇదే కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 17 మంది ఆసుపత్రిలో చేరారు. తాగునీరు కలుషితం కావడంతో ఇక్కడ ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి.