News October 27, 2024
2 నుంచి సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ జర్నీ

పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం NOV 2 నుంచి పునః ప్రారంభం కానుంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు ₹2,000, పిల్లలకు ₹1,600గా నిర్ణయించారు. వెళ్లి రావడానికి పెద్దలకు ₹3,000, పిల్లలకు ₹2,400 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 7997951023, 9848540371, 9848125720 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Similar News
News February 11, 2026
అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ‘వార్’ తప్పదా?

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్న నేపథ్యంలో YCP చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తిగా హాజరవడం అనుమానమే. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, YCP నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.
News February 11, 2026
మున్సి‘పోల్’కు వేళాయే!

TG: మున్సిపోల్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉ.7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటర్/ఆధార్/పాన్/డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
News February 11, 2026
జగమంతా శివతత్వం

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.


