News October 27, 2024

‘హైడ్రా’కు హండ్రెడ్ డేస్.. ఇకపై తగ్గేదేలే: రంగనాథ్

image

TG: హైడ్రా సైలెంట్ కాలేదని, మరింత బలోపేతం అవుతోందని హైడ్రా ఏర్పడి వందరోజులైన సందర్భంగా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇకపై పక్కా ప్లాన్, ఆధారాలతో ముందడుగు వేస్తామన్నారు. త్వరలోనే చెరువులన్నింటికీ FTL, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో ఆక్రమణదారులకు హైడ్రా సింహస్వప్నంలా మారిందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అన్నీ చెక్ చేసుకున్నాకే స్థలాలు కొంటున్నారని తెలిపారు.

Similar News

News October 27, 2024

రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!

image

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News October 27, 2024

ఏపీలో మంచి ఎకో సిస్టం ఉంది: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

News October 27, 2024

కరెంట్ షాక్‌తో ‘యమరాజు’ కన్నుమూత

image

‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్‌సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.