News October 27, 2024

అనురాధ ముందు అనేక సవాళ్లు

image

APPSC ఛైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న AR అనురాధ ముందు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనేక సవాళ్లు ఉన్నాయి. ఆయుష్ విభాగంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం చూస్తున్నారు. గ్రూప్-1, 2 DYEO, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు వంటి పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 2, 2024

జూన్ కల్లా రేవంత్‌ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి

image

TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.

News November 2, 2024

మళ్లీ అల్పపీడనం.. 7 నుంచి భారీ వర్షాలు

image

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.

News November 2, 2024

UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు

image

వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ట్రాన్సాక్షన్ల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ రూ.23.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు NPCI వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక నెలలో ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 45 శాతం, విలువపరంగా 34 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. రోజువారీ లావాదేవీలు 535 మిలియన్లుగా నమోదైనట్లు వివరించింది.