News October 27, 2024
కార్తీక మాసం ఎప్పుడంటే?
TG: నవంబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని తెలిపింది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Similar News
News November 2, 2024
జూన్ కల్లా రేవంత్ను దింపేస్తారు: మహేశ్వర్ రెడ్డి
TG: వచ్చే ఏడాది జూన్ కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ స్థానంలో ఉత్తమ్ లేదా భట్టివిక్రమార్కకు సీఎం పదవి దక్కొచ్చన్నారు. ఆ పార్టీలోని ఓ వర్గం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ అడ్లూరి ఖండించారు.
News November 2, 2024
మళ్లీ అల్పపీడనం.. 7 నుంచి భారీ వర్షాలు
AP: వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
News November 2, 2024
UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు
వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్లో ట్రాన్సాక్షన్ల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ రూ.23.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు NPCI వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక నెలలో ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 45 శాతం, విలువపరంగా 34 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. రోజువారీ లావాదేవీలు 535 మిలియన్లుగా నమోదైనట్లు వివరించింది.