News October 27, 2024

ఉదయం చలి.. పగలు ఎండ

image

AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

Similar News

News October 27, 2024

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం?

image

TG: అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికవడం, వారు ఒక ఉద్యోగంలో చేరగానే మిగతా జాబ్స్ బ్యాక్‌లాగ్ అవడం పెరుగుతోంది. తాజాగా గురుకులాల్లో 2వేల పోస్టులు మిగిలిపోయాయి. దీంతో తిరిగి ‘రీలింక్విష్‌మెంట్’ను అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం యోచిస్తోంది. ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారి నుంచి మిగతా ఉద్యోగాలను వదులుకున్నట్లు అంగీకార పత్రం తీసుకుంటుంది. దీంతో ఆ పోస్టు తదుపరి మెరిట్ అభ్యర్థికి దక్కుతుంది.

News October 27, 2024

గాజాపై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 45 మంది మృతి

image

ఇరాన్‌పై ప్ర‌తీకార దాడుల‌కు దిగిన త‌రువాతి రోజే గాజాపై ఇజ్రాయెల్ ద‌ళాలు దండెత్తాయి. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో 6 భ‌వ‌నాలు ల‌క్ష్యంగా జ‌రిపిన దాడిలో 45 మంది మృతి చెందారు. పాల‌స్తీనాపై గ్రౌండ్ ఆప‌రేష‌న్స్‌, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా అక్క‌డి మొత్తం జ‌నాభా నిర్మూలన‌కు జ‌రుగుతున్న వ్య‌వ‌స్థీకృత దాడుల‌ను నిలువ‌రించేలా అమెరికా క‌ల్పించుకోవాల‌ని అమెరిక‌న్ ఇస్లామిక్ రిలేష‌న్స్‌ కౌన్సిల్ పిలుపునిచ్చింది.

News October 27, 2024

రేవ్ పార్టీనా? రావుల పార్టీనా?: రఘునందన్

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న CC ఫుటేజీలను విడుదల చేయాలని BJP MP రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘DGP వెంటనే ప్రెస్‌మీట్ పెట్టాలి. లేదంటే ఎడిటింగ్‌లు స్టార్ట్ అవుతాయి. KTR, రేవంత్ ఒక్కటి కాకపోతే ఫామ్‌హౌస్‌లో ఏం జరిగిందో సమాజం తెలుసుకోవాలనుకుంటోంది. మళ్లీ మేం పేరు చెబితే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు. అందుకే ఆ పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్ పార్టీనా, రావుల పార్టీనా అనేది బయటపడాలి’ అని అన్నారు.