News October 27, 2024

క్షీణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ ఆరోగ్యం!

image

ఇజ్రాయెల్ ప్ర‌తీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్‌ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖ‌మేనీ(85) ఆరోగ్య ప‌రిస్థితి కలవరపెడుతోంది. ఖ‌మేనీ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్ప‌టికే మాజీ అధ్య‌క్షుడు ఇజ్ర‌హీం రైసీ మృతితో దేశంలో అస్థిర‌త ఏర్ప‌డ‌డంతో తాజాగా ఖ‌మేనీ అనారోగ్యం ఇరాన్‌ను దిగులు పెడుతోంది. ఖ‌మేనీ వార‌సుడిగా రెండో పెద్ద‌కుమారుడు మొజ్తాబా ప‌గ్గాలు చేప‌డతారని తెలుస్తోంది.

Similar News

News October 27, 2024

సీనియర్లకు షాకిచ్చిన గంభీర్!

image

న్యూజిలాండ్ చేతిలో ఘోర <<14459559>>ఓటమితో <<>>భారత కోచ్ గంభీర్ కఠిన చర్యలకు దిగినట్లు సమాచారం. ఇంతకాలం సీనియర్లకున్న ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ అవకాశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లకు గతంలో ఇది ఆప్షనల్‌గా ఉండేది. ఇకపై ప్రతి ఒక్క ప్లేయర్ పక్కాగా హాజరుకావాలని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసినట్లు సమాచారం. NOV 1 నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కానుండగా, OCT 30-31 వరకు ట్రైనింగ్ నిర్వహించనుంది.

News October 27, 2024

అనుకున్నదొకటి.. అవుతోందొకటి!

image

రోహిత్-గంభీర్ కాంబోపై భారీ అంచనాలుండేవి. దూకుడైన గంభీర్ కోచ్‌గా ఇంటెలిజెంట్ కెప్టెన్‌గా పేరున్న రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా తిరుగులేని శక్తిగా మారుతుందని అనుకున్నాం. కానీ వీరి కాంబినేషన్‌లో 27ఏళ్ల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్, సొంతగడ్డపై 12ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు టెస్ట్ సిరీస్ అప్పగించింది భారత జట్టు. NZ చేతిలో 36ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు ఓడింది. 1-5లో వీరికి మీ రేటింగ్ ఎంత?

News October 27, 2024

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం?

image

TG: అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికవడం, వారు ఒక ఉద్యోగంలో చేరగానే మిగతా జాబ్స్ బ్యాక్‌లాగ్ అవడం పెరుగుతోంది. తాజాగా గురుకులాల్లో 2వేల పోస్టులు మిగిలిపోయాయి. దీంతో తిరిగి ‘రీలింక్విష్‌మెంట్’ను అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం యోచిస్తోంది. ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారి నుంచి మిగతా ఉద్యోగాలను వదులుకున్నట్లు అంగీకార పత్రం తీసుకుంటుంది. దీంతో ఆ పోస్టు తదుపరి మెరిట్ అభ్యర్థికి దక్కుతుంది.