News October 27, 2024
‘దృశ్యం’లో వెంకటేశ్ చిన్నకూతురు.. ఇప్పుడెలా అయ్యారో చూడండి!

విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.
Similar News
News February 6, 2026
థైరాయిడ్ రకాలివే..

థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి థైరాయిడ్ గ్రంధి నుంచి హార్మోన్లు అధికంగా ఉత్పత్తైతే హైపర్ థైరాయిడ్, తక్కువగా ఉత్పత్తైతే హైపో థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ స్థాయిని సరిగ్గా నిర్వహించలేకపోతే అది గుండె, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉంటే థైరాయిడ్ ఉందని గమనించాలి. ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News February 6, 2026
థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే

థైరాయిడ్ టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల్లోపు ఖాళీ కడుపుతో చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఏ సమయంలోనైనా పరీక్ష జరిగితే రిపోర్ట్ కరెక్ట్‌గా రాదు. రోగులు థైరాయిడ్ పరీక్షల కోసం వచ్చినప్పుడు మందులు తీసుకోకూడదు. రోగులు తమంతట తాముగా మందుల మోతాదు లేదా మొత్తాన్ని తగ్గించుకోకూడదు. అలాగే హైపర్ థైరాయిడిజం మందులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. హైపోథైరాయిడిజం మందులు మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
News February 6, 2026
రెండో వాహనం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్

TG: రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. సెకండ్ వెహికల్‌పై విధిస్తున్న 2 శాతం అదనపు రోడ్డు ట్యాక్స్‌ను రద్దు చేయాలన్న రవాణాశాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాహనదారులపై ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా భారం తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


