News October 27, 2024
విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్రమంత్రి
AP: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ 9.35amకు విశాఖలో బయలుదేరి 10.35amకు గన్నవరం చేరుతుంది. తిరిగి 7.55pmకు విజయవాడ నుంచి బయలుదేరి 9pmకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు 7.15pmకు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, 8.45pmకు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుతుంది. ఈ నగరాల మధ్య విమానాల సంఖ్య 3కి చేరింది.
Similar News
News November 2, 2024
అది మీకు మూడే ఛాప్టర్ లోకేశ్: వైసీపీ
AP: త్వరలోనే రెడ్‌బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి లోకేశ్ చేసిన <<14502154>>హెచ్చరికలపై<<>> వైసీపీ Xలో సెటైర్లు వేసింది. ‘మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. అది మీకు మూడే ఛాప్టర్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. మీ MLAలు, అనుచరులు పోలీసులను బానిసలుగా చూడటాన్ని పట్టించుకోలేదనుకుంటున్నారా? మీ అన్ని ఛాప్టర్‌లు క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది గుర్తుంచుకోండి’ అని పేర్కొంది.
News November 2, 2024
రోహిత్‌ను వెనక్కి నెట్టిన జైస్వాల్.. సరికొత్త రికార్డ్
టెస్టుల్లో యశస్వీ జైస్వాల్ సరికొత్త ఘనత సాధించారు. 25 ఇన్నింగ్సుల తర్వాత అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా నిలిచారు. 1,402 పరుగులతో జైస్వాల్ టాప్‌లో ఉండగా, ఆ తర్వాత రోహిత్ శర్మ(1,324), సునీల్ గవాస్కర్(1,301), మయాంక్ అగర్వాల్(1,247), కేఎల్ రాహుల్(1,145), సెహ్వాగ్(1,132), ధావన్(1,130) ఉన్నారు. కాగా కివీస్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 30 రన్స్ చేశారు.
News November 2, 2024
ఆనంద్ బయోపిక్‌కు ఏఎల్ విజయ్ డైరెక్షన్
ప్రముఖ చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ బయోపిక్ స్క్రిప్ట్‌ను ‘బిన్నీ అండ్ ఫ్యామిలీ’ రచయిత, దర్శకుడు సంజయ్ త్రిపాఠీ అందిస్తున్నట్టు సమాచారం. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ పాత్రను దక్షిణాది నుంచి ఓ ప్రముఖ నటుడు పోషిస్తారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.