News October 27, 2024

మంత్రుల కమిటీలో కొండపల్లికి చోటు

image

టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు చోటు దక్కింది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలపై సూచనలు చేయనుంది.

Similar News

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.

News September 18, 2025

VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

image

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.

News September 18, 2025

సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

image

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.