News October 27, 2024

విశాఖలో ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్: లోకేశ్

image

AP ఆర్థిక రాజధాని విశాఖకు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, డేటా సెంటర్ రాబోతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌పోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా సంస్థలు రాబోతున్నాయి. అమరావతిలో 5 బిలియన్ డాలర్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం’ అని ఆయన చెప్పారు.

Similar News

News October 27, 2024

క్రాకర్స్ కాల్చేవారికి పోలీసుల షాక్

image

TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్‌కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

News October 27, 2024

రేవ్ పార్టీలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు: కాంగ్రెస్

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్‌ఫ్రీ రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్నవారి వివరాలు బయటపెట్టాలని MLC బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలను ప్రోత్సహించేది బీఆర్ఎస్సేనని బండ్రు శోభారాణి ఆరోపించారు.

News October 27, 2024

నాణ్యతలో రాజీ పడవద్దు: పవన్ కళ్యాణ్

image

AP: ఉపాధిహామీ పనుల నాణ్యతలో రాజీపడొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని, ఉపాధిహామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిన్న పలు పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేసిన ఫొటోలను పవన్ పంచుకున్నారు. గత ప్రభుత్వం చేసినట్లు నిధులు పక్కదారి పట్టించవద్దని పవన్ ఈ సందర్భంగా కోరారు.