News October 27, 2024

‘దీపావళి’ స్కామ్స్.. జాగ్రత్త

image

దీపావళి ముంగిట సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. భారీ ఆఫర్లంటూ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్ల లింకులు, APK ఫైళ్లను వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. ఏదైనా వస్తువు కోసం డబ్బు చెల్లించినా డెలివరీ కావట్లేదు. వ్యక్తిగత సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్తోంది. అలాగే బంపర్ డ్రా, లాటరీల పేరుతోనూ స్కామ్‌లు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News October 27, 2024

MVA తీరుపై అఖిలేశ్ అసంతృప్తి

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మ‌హావికాస్ అఘాడీ కూట‌మి తీరుపై SP చీఫ్ అఖిలేశ్ కినుక వహించారు. తమకు సీట్ల కేటాయింపులో కూటమి పార్టీలు జాప్యం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. SP పోటీ చేయాల‌ని భావిస్తున్న ధులె సీటుకు శివ‌సేన UBT అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు అబు అజ్మీ త‌ప్పుబ‌ట్టారు. 5 సీట్లు ఇవ్వ‌క‌పోతే 20 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామ‌ని తెలిపారు.

News October 27, 2024

క్రాకర్స్ కాల్చేవారికి పోలీసుల షాక్

image

TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్‌కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

News October 27, 2024

రేవ్ పార్టీలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు: కాంగ్రెస్

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్‌ఫ్రీ రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్నవారి వివరాలు బయటపెట్టాలని MLC బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలను ప్రోత్సహించేది బీఆర్ఎస్సేనని బండ్రు శోభారాణి ఆరోపించారు.