News October 27, 2024

కరెంట్ షాక్‌తో ‘యమరాజు’ కన్నుమూత

image

‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్‌సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.

Similar News

News October 27, 2024

MVA తీరుపై అఖిలేశ్ అసంతృప్తి

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి మ‌హావికాస్ అఘాడీ కూట‌మి తీరుపై SP చీఫ్ అఖిలేశ్ కినుక వహించారు. తమకు సీట్ల కేటాయింపులో కూటమి పార్టీలు జాప్యం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. SP పోటీ చేయాల‌ని భావిస్తున్న ధులె సీటుకు శివ‌సేన UBT అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు అబు అజ్మీ త‌ప్పుబ‌ట్టారు. 5 సీట్లు ఇవ్వ‌క‌పోతే 20 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామ‌ని తెలిపారు.

News October 27, 2024

క్రాకర్స్ కాల్చేవారికి పోలీసుల షాక్

image

TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్‌కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

News October 27, 2024

రేవ్ పార్టీలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు: కాంగ్రెస్

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. డ్రగ్‌ఫ్రీ రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్నవారి వివరాలు బయటపెట్టాలని MLC బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలను ప్రోత్సహించేది బీఆర్ఎస్సేనని బండ్రు శోభారాణి ఆరోపించారు.