News October 27, 2024

ఏపీలో మంచి ఎకో సిస్టం ఉంది: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

Similar News

News October 27, 2024

‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎప్పుడంటే?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News October 27, 2024

ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి

image

TG: ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలచే బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. త్వరలోనే వారు బస్సు యజమానులుగా మారతారన్నారు.

News October 27, 2024

దీపావళి లక్ష్మీపూజకు సమయమిదే?

image

శ్రీరాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చింది, అలాగే నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఈ రోజునే దీపావళిగా జరుపుకుంటారని ప్రతీతి. అప్పటినుంచి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య లక్ష్మీపూజ సమయమని పండితులు చెబుతున్నారు.