News October 27, 2024

Digital Arrest మోసాలపై స్పందించిన మోదీ

image

భార‌త న్యాయ చ‌ట్టాల్లో డిజిటల్ అరెస్టు వంటి వ్యవస్థ ఏదీ లేద‌ని ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు. డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక మోసాలు అధిక‌మ‌వుతుండ‌డంపై మ‌న్ కీ బాత్‌లో మోదీ స్పందించారు. ఇదోర‌క‌మైన మోస‌మ‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేవారు సంఘ విద్రోహుల‌ని అన్నారు. డిజిట‌ల్ అరెస్టు పేరుతో జ‌రుగుతున్న మోసాల క‌ట్ట‌డికి దర్యాప్తు సంస్థ‌లు రాష్ట్రాలతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్టు తెలిపారు.

Similar News

News November 10, 2025

తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

image

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR న‌ష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు త‌క్ష‌ణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. ఉద్యాన‌, మ‌ల్బ‌రీ తోట‌లూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ ప‌నులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు.

News November 10, 2025

రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా

image

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్‌గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్‌ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.

News November 10, 2025

శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

image

☛ విషాన్ని ఆయన గొంతులోనే ఉంచుకొని లోకాన్ని రక్షించినట్లు, మన జీవితంలోని ప్రతికూలతలను నియంత్రించడం నేర్చుకోవాలి.
☛ ఆయన నుదుటిపై మూడో కన్ను జ్ఞానం, వివేకానికి చిహ్నం. అలాంటి వివేకంతో సత్యాసత్యాలను, మంచి-చెడులను గుర్తించే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
☛ శివుడు భస్మం, రుద్రాక్షలతో నిరాడంబరంగా ఉంటాడు. నిజమైన శక్తికి ఆడంబరాలు అనవసరమని అర్థం. ☛ ధ్యానంతో మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచుకోవాలి.