News October 27, 2024
గుంటూరు: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతాయని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
Similar News
News November 7, 2025
GNT: రచనలను, ఉద్యమాలే ఆయన జీవిత ధ్యేయం

ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత, ప్రజా కళాకారుడు, కమ్యూనిస్టు నాయకుడు బొల్లిముంత శివరామకృష్ణ నవంబర్ 27, 1920 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చదలవాడలో జన్మించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రచనలను, ఉద్యమాలను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఆయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అన్యాయాలు, రైతుల కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినీ రచయితగా ‘నిమజ్జనం’కి జాతీయ అవార్డు లభించాయి.
News November 6, 2025
GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.
News November 6, 2025
GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.


