News October 27, 2024
ప.గో: చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల

పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం క్యాంపు కార్యాలయంలో నిరుపేదలైన 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.3.20 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.
News September 15, 2025
ఆకివీడు తహశీల్దార్ నియామకంలో గందరగోళం!

ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. MLA ఆదేశాలతోనే తొలుత ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారంటూ YCP శ్రేణులు ఆర్డర్ కాపీలను ట్రోల్ చేస్తున్నాయి.
News September 15, 2025
పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.