News October 27, 2024
ఆర్టీసీలో డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం: భట్టి

TG: ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలచే బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. త్వరలోనే వారు బస్సు యజమానులుగా మారతారన్నారు.
Similar News
News November 2, 2025
కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. రిఫ్ట్ వ్యాలీలో కొండచరియలు విరిగిపడి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గల్లంతు అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వెస్ట్రన్ కెన్యాలో వరదలొచ్చి రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు ధ్వంసమై పలువురు నిరాశ్రయులు అయ్యారు.
News November 2, 2025
చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.
News November 2, 2025
అడుగులోనే అరక విరిగిందట

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.


