News October 27, 2024
జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. UPDATE

TG: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో రైడ్ చేశామని FIRలో తెలిపారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు తేలిందని, మిగతా వారు టెస్టులకు సహకరించలేదని చెప్పారు. రాజ్ సూచించడంతోనే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విజయ్ చెబుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
తుర్కియే, పాకిస్థాన్, సౌదీ.. ‘ఇస్లామిక్ నాటో’ కూటమి?

పాకిస్థాన్, సౌదీ అరేబియాతో కలిసి ‘ఇస్లామిక్ నాటో’ అనే రక్షణ కూటమి ఏర్పాటు చేసేందుకు తుర్కియే ప్లాన్ చేస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే 350 డ్రోన్లు ఇచ్చి పాక్‌కు సపోర్ట్ చేసింది. మరోవైపు గతేడాది పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు డిఫెన్స్ పరంగా తలనొప్పేనని విశ్లేషకులు చెబుతున్నారు.
News January 13, 2026
సంక్రాంతి విషెస్ చెప్పిన సీఎం రేవంత్

TG: తెలుగు ప్రజలకు CM రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అంతా ఆనందంగా జరుపుకోవాలి. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రతి కుటుంబానికి చేరాలనేది మా సంకల్పం. తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాకారం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.
News January 13, 2026
రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.


