News October 27, 2024
ముగిసిన గ్రూప్-1 మెయిన్స్

TG: రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 563 పోస్టులకు ఈ నెల 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వరుసగా 7 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జీవో 29ను రద్దు చేశాకే పరీక్షలు జరపాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
Similar News
News October 21, 2025
155% టారిఫ్స్ విధిస్తా.. చైనాకు ట్రంప్ వార్నింగ్

చైనాపై 155% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘సుంకాల రూపంలో చైనా నుంచి మనకు అపారమైన డబ్బు వస్తోంది. ప్రస్తుతం 55% చెల్లిస్తోంది. మనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి 155% చెల్లించాల్సి రావచ్చు’ అని హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలకు ముందు ఆయన మాట్లాడారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను సౌత్ కొరియాలో కలవనున్నట్లు వెల్లడించారు.
News October 21, 2025
వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.
News October 20, 2025
దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్‌లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.