News October 27, 2024

దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.

Similar News

News October 28, 2024

రీఛార్జ్ రేట్లు తగ్గింపు?

image

BSNL దెబ్బకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జులైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లను పెంచడంతో లక్షలాది కస్టమర్లు BSNLకు మారుతున్నారు. దీంతో రేట్లను తగ్గించాలని ప్రైవేట్ కంపెనీలు భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజును 8% నుంచి 0.5-1% తగ్గించాలని కోరుతున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News October 28, 2024

నీతా అంబానీ మంచి మనసు.. చిన్నారులకు ఉచిత చికిత్స

image

రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆరోగ్య సేవా కార్యక్రమానికి నీతా అంబానీ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గుండె సంబంధింత సమస్యతో బాధపడుతున్న 50వేల మంది చిన్నారులకు, గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 50వేల మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్‌తో పాటు చికిత్స అందించనున్నారు. దీంతో పాటు 10వేల మంది బాలికలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ అందివ్వనున్నారు.

News October 27, 2024

ఐదేళ్లలో కోహ్లీ చేసింది 2 సెంచరీలే: ఆకాశ్ చోప్రా

image

విరాట్ కోహ్లీ ఫామ్‌పై భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు కురిపించారు. ‘టెస్టుల్లో విరాట్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 2 సెంచరీలు మాత్రమే చేశారు. సగటు చూస్తే 2020లో 19, 2021లో 28, 2022లో 26గా ఉంది. గత ఏడాది రెండు సెంచరీలు చేసినా అందులో ఒకటి అహ్మదాబాద్‌లోని నిర్జీవమైన పిచ్‌పై వచ్చింది. ఇక ఈ ఏడాది 8 ఇన్నింగ్స్ ఆడినా సగటు 32గానే ఉంది’ అని పెదవి విరిచారు.